మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్

     Written by : smtv Desk | Wed, Jan 22, 2020, 10:43 AM

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు.దేశంలో మొదటిసారిగా మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో యాప్ ను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. కొంపల్లి ఆరు వార్డుల్లోని 10 పోలింగ్ స్టేషన్లలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉపయోగిస్తున్నారు. స్థానిక 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఓటర్ల గుర్తింపు కొనసాగుతోంది.ప్రజలందరూ తప్పక ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఒటేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వనపర్తి జిల్లా 23వ వార్డులో మంత్రి నిరంజన్ రెడ్డి, 29వ వార్డులో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొద్దున ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.





Untitled Document
Advertisements