కివీస్ తో సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. పృథ్వీ షా,సంజు శాంసన్‌ కి పిలుపు

     Written by : smtv Desk | Wed, Jan 22, 2020, 11:12 AM

కివీస్ తో సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. పృథ్వీ షా,సంజు శాంసన్‌ కి పిలుపు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి భారత సెలక్టర్లు తాజాగా జట్టుని ప్రకటించారు. ఈ మేరకు 16 మందితో కూడిన జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ ఆడుతూ గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ స్థానంలో పృథ్వీ షాకి అవకాశం ఇచ్చారు.

భారత వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ట్ కెప్టెన్), పృథ్వీ షా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్, కేదార్ జాదవ్

భారత్ జట్టులో ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రూపంలో ప్రొఫెషనల్ ఓపెనర్లు ఉన్నప్పటికీ.. పృథ్వీ షాకి మూడో ఓపెనర్‌గా సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఒకవేళ రాహుల్‌ని మిడిలార్డర్‌లో ఆడిస్తే..? అప్పుడు పృథ్వీ షాకి ఓపెనర్‌‌గా ఛాన్స్ దక్కనుంది. 2018లో చివరిగా భారత్ తరఫున టెస్టులు ఆడిన పృథ్వీ షా అనంతరం గాయం, డోపింగ్ టెస్టులో ఫెయిలై 8 నెలలు నిషేధం ఎదుర్కోన్నాడు. అయితే.. గత ఆదివారం న్యూజిలాండ్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 100 బంతుల్లో 150 పరుగులు చేసి భారత్-ఎ జట్టుని ఒంటిచేత్తో గెలిపించాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం ఇటీవల భారత సెలక్టర్లు ప్రకటించిన జట్టులోనూ ఒక మార్పు జరిగింది. భుజం గాయంతో శిఖర్ ధావన్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో సంజు శాంసన్‌ ఎంపికయ్యాడు. అయితే.. అతను ప్రత్యామ్నాయ ఓపెనర్ మాత్రమే అని సెలక్టర్లు స్పష్టం చేశారు. గత ఏడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ సిరీస్‌కి సంజు శాంసన్ ఎంపికైనా.. అతడ్ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. దీంతో.. న్యూజిలాండ్ టూర్‌లోనూ అతనికి అవకాశం దక్కడం అనుమానమే.

భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

న్యూజిలాండ్ టీ20 జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజిన్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, టామ్ బ్రూసీ, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), హమీశ్ బెనెట్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, బ్లైర్ టింకర్

టీ20, వన్డే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే

భారత కాలమాన ప్రకారం టీ20 మ్యాచ్‌లు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుండగా.. వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి.

జనవరి 24న అక్లాండ్ వేదికగా తొలి టీ20,
26న అక్లాండ్ వేదికగా రెండో టీ20,
29న హామిల్టన్ వేదికగా మూడో టీ20,
31న వెల్లింగ్టన్ వేదికగా నాలుగో టీ20,
ఫిబ్రవరి 2న బే ఓవల్ వేదికగా ఐదో టీ20.

ఫిబ్రవరి 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే,
8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే,
11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే,

టెస్టు సిరీస్ షెడ్యూల్

టెస్టు మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం.. ఉదయం 4 గంటలకి ప్రారంభంకానున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం 3.30 గంటలకే మొదలవనుంది.

ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్,
ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు,
ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు.





Untitled Document
Advertisements