భర్తను చెరో 3 రోజులు పంచుకున్న భార్యలు!!!

     Written by : smtv Desk | Wed, Jan 22, 2020, 11:18 AM

‘ఏవండి.. ఆవిడొచ్చింది’ సినిమా చూశారా? అందులో శోభనబాబుకు ఇద్దరు భార్యలు ఉంటారు. మూడు రోజులు మొదటి భార్య దగ్గర, మరో మూడు రోజులు రెండో భార్య దగ్గర ఉంటాడు. ఒక రోజు మాత్రం అతడికి స్వేచ్ఛ లభిస్తుంది. ఆ రోజు హాయిగా తన ఇంటికి వెళ్లి.. తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. జార్ఖండ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రాంచీకి చెందిన రాజేష్‌కు శోభనబాబు తరహాలోనే ఇద్దరు భార్యలు ఉన్నాడు. అయితే, ఇద్దరికి సమన్యాయం చేయడంలో అతడు విఫలమయ్యాడు. మొదటి భార్యకు తక్కువ సమయం కేటాయిస్తూ.. రెండో భార్యతో ఎక్కువ రోజులు గడపడం మొదలుపెట్టాడు. దీంతో మొదటి భార్య కోపంతో ఊగిపోయేది. తనతో గడపాలని మొదటి భార్య అతడికి కొద్ది రోజులు చెప్పి చూసింది. కానీ, అతడు వినలేదు. రెండో భార్య దగ్గరే ఎక్కువసేపు గడిపేందుకు ఇష్టపడేవాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. తన మొరను పోలీసులకు వినిపించింది. దీంతో పోలీసులు రాజేష్‌ను, రెండో భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిచి క్లాస్ పీకారు. ఇది భార్యభర్తల వ్యవహారం కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా పెదరాయుడి తరహాలో తీర్పు చెప్పారు. మొదటి భార్యకు సమయం కేటాయించాలని చెప్పారు. దీంతో రాజేష్ ఆమె వద్ద ఎక్కువ రోజులు ఉండటం మొదలుపెట్టాడు. ఇది రెండో భార్యకు నచ్చలేదు. ‘‘మీ తీర్పు వల్ల నా భర్త దూరమయ్యాడు. ఎక్కువ రోజులు మొదటి భార్య దగ్గర ఉంటున్నాడు’’ అని పోలీసులకు మొరపెట్టుకుంది. రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు మళ్లీ రాజేష్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. అతడితో కలిసి వచ్చిన మొదటి భార్య.. రెండో భార్యతో తగవుపడింది. దాదాపు జట్లు పట్టుకొని కొట్టుకొనేంత పనిచేశారు. ‘‘నా మొగుడు నా ఇష్టం’’ అంటూ గత్తరలేపారు. దీంతో పోలీసులు.. ఇద్దరికీ సమన్యాయం చేసే తీర్పు ఇచ్చారు. వారంలో వారంలో మూడు రోజులు మొదటి భార్య వద్ద, మరో మూడు రోజులు రెండో భార్య వద్ద ఉండాలని పోలీసులు తీర్పు ఇచ్చారు. సోమవారం నుంచి శనివారం వరకు భార్యలతో కలిసే ఉండాలని, ఆదివారం ఒక్క రోజు సెలవు తీసుకోవాలని తెలిపారు. అయితే, ‘ఏవండి ఆవిడ వచ్చింది’ సినిమా తరహాలో రాజేష్‌కు తల్లిదండ్రులు లేరు. దీంతో పోలీసులు ‘‘ఆ రోజు ఎవరి వద్ద ఉండాలని అనుకుంటున్నావో వారి వద్ద ఉండు.. ఆ నిర్ణయం నీదే’’ అని చెప్పేశారు. దీంతో సమస్య కొంతవరకు పరిష్కారమైంది.













Untitled Document
Advertisements