కోబ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతాడని 2012లోనే ఊహించారా..?

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 05:52 PM

కోబ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతాడని 2012లోనే  ఊహించారా..?

అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయాంట్ ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలీస్‌లోని తన అకాడమీకి వెళుతుండగా.. కోబ్‌తోపాటు ఆయన కుమార్తె గియాన్న బ్రయాంట్, మరో ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించారు. క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ ఘటనను ఒక ట్విట్టర్ యూజర్ ముందుగానే ఊహించినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల కిందటే కోబ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడని ఆ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అప్పట్లో తీవ్ర దుమారం రేపిన ట్వీట్.. తాజాగా నిజమవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డాట్ నోసో అనే పేరుగల అకౌంట్ నుంచి ఏడేళ్ల కిందట అనగా సరిగ్గా నవంబర్ 14, 2012లో ఈ ట్వీట్ వెలువడింది. హెలికాప్టర్ కూలిపోవడం వల్ల కోబ్ బ్రయాంట్ మరణిస్తారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌పై బాస్కెట్‌బాల్ అభిమానులు, నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. నెటిజన్ల తాకిడితో ఈ పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాజాగా బ్రయాంట్ మరణం అనంతరం డాట్ నోసో అకౌంట్ నుంచి మరోసారి స్పందన వ్యక్తమైంది. అప్పట్లో బ్రయాంట్‌పై పెట్టిన పోస్టుపై క్షమాపణలను నిర్వాహకులు పోస్టు చేశారు. అమెరికా తరపున అత్యు్త్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల్లో బ్రయాంట్ ఒకరు. 1996లో కెరీర్ ప్రారంభించిన ఆయన ఒలింపిక్ స్వర్ణాన్ని రెండుసార్లు నెగ్గిన అమెరికా జట్టులో సభ్యునిగా ఉన్నారు. బాస్కెట్‌బాల్ నుంచి ఆయన రిటైర్ అయిన అనంతరం కుమార్తె గియన్నాకు ఈ క్రీడలో శిక్షణనిస్తున్నారు. మరోవైపు బ్రయాంట్ మరణంపై ఎంతోమంది దిగ్గజ క్రీడాకారులు, ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. భారత క్రికెటర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ తదితరులు ఉన్నారు.








Untitled Document
Advertisements