రాకాసి దోమ...కుడితే కాటికే!

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 06:43 PM

రాకాసి దోమ...కుడితే కాటికే!

దోమ చిన్నగానే ఉన్నా.. బోలెడన్నీ రోగాలను మోసుకొస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, అది చిన్న ప్రాణి కావడంతో చాలా సులభంగా తరిమికొట్టేస్తాం లేదా చంపేస్తాం. అదే దోమ.. తూనీగ సైజులో ఉంటే ఏం చేస్తారు? ఇదిగో ఈ దోమను చూస్తే వామ్మో.. అనకుండా ఉండలేరు. స్పెయిన్‌లోని కార్డోబ ప్రాంతంలో ఈ దోమ సంచరిస్తోందట. ఎజెక్వీల్ లోబో అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘అది మా ఇంటి కిటికీ నుంచి గదిలోకి ప్రవేశించింది. దాన్ని చూడగానే మా అమ్మ పురుగుల మందును స్ప్రే చేసింది. దీంతో అది చనిపోయింది’’ అని తెలిపాడు. ఇది దోమేనా? లేదా ఇంకా వేరే ఏదైనా కీటకమా? మీరు ఇలాంటి జీవిని ఎక్కడైనా చూశారా? అని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు. లోబో పోస్టు చేసిన ఆ ఫొటోను చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘వామ్మో, అంత పెద్ద దోమా? అది ఖచ్చితంగా గ్రహాంతరవాసి (ఎలియన్) అవ్వి ఉంటుంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ దోమ కేవలం డెంగ్యూ మాత్రమే కాదు, అన్నిరకాల వ్యాధులను ఒకేసారి వ్యాప్తి చేయగలదు అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ఫొటోను ఇప్పటివరకు 23 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. 1.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు.





Untitled Document
Advertisements