"RSS ఓ టెర్రరిస్టు సంస్థ": అంబేద్కర్ మనవడు

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 08:45 PM


భారత ఉగ్రవాద సంస్థ అంటూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మునిమనవడు రాజారత్న అంబేద్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీకి ఆయుధాలు కొరవడినప్పుడు ఆరెస్సెస్ అందజేసిందని గతంలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ, దీన్ని బట్టే ఆ సంస్థ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అని తెలియడం లేదా అని ప్రశ్నించారాయన. ఆదివారం కర్ణాటకలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్‌లో నేను గతంలో ఇచ్చిన స్పీచ్ మీరంతా చూడాలి. ఆరెస్సెస్ ఓ టెర్రరిస్టు సంస్థ అని నేను అక్కడ చెప్పా. దీన్ని సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థను పూర్తిగా నిషేధించాలి’ అని అన్నారు. ప్రధాని మోడీ పక్కన కనిపించే ఓ సాధ్వి (ప్రజ్ఞా సింగ్ ఠాకూర్) గతంలో మాట్లాడుతూ ఆర్మీ దగ్గర పూర్తిగా ఆయుధాలు అయిపోతే ఆరెస్సెస్ అందజేసిందని చెప్పారన్నారు రాజారత్న అంబేద్కర్. అయితే ఆరెస్సెస్‌కు తుపాకులు, బుల్లెట్ల్, బాంబులు, ఇతర ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఇంట్లోనైనా బాంబులు, తుపాకీలు లాంటివి పోలీసులు రికవరీ చేస్తే ఆ ఇంటిని, అందులోని మనుషుల్ని టెర్రరిస్టులని కాకుండా మరేమనాలని అడిగారు. ఒక సంస్థ దగ్గర ఇవి ఉంటే ఉగ్రవాద సంస్థ అని అనకూడదా అన్నారు. టెర్రరిస్టు కార్యకలాపాల్లో ఆరెస్సెస్ వ్యక్తులు అరెస్టు అవుతున్నారని, ఇలాంటి సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు రాజారత్న.






Untitled Document
Advertisements