జగన్ తీరుపై నారా లోకేశ్ సీరియస్

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 08:09 AM

ఏపీ సీఎం జగన్ తీరుపై నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మొన్న మండలిలో వ్యతిరేకించడంతో దీనిపై చర్చలు జరిపిన ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని భావించుకుంది. అయితే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే శాసన మండలి పనిచేస్తుందని, ప్రజా ప్రయోజనాలు రద్దు చేయడానికే మండలి ఉందని, ఇలాంటి శాసన మండలికి ప్రజాధనం ఖర్చు చేయడం శుద్ద దండగ అని అన్నారు. మండలిని రద్దు చేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పుకొచ్చారు.

అయితే మండలి రద్దు తీర్మానానికి మద్ధతుగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా మండలిని రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ స్పీకర్ ప్రకటించారు. అయితే శాసనసభలో సరైన స్థాయిలో చర్చ జరగకుండానే బిల్లులు పాస్ అవుతున్నాయి అంటూ ఆనాడు మండలిని తండ్రి పునరుద్ధరించారని, శాసనమండలి అభివృద్ధికి ఆటంకంగా మారింది, ప్రజాధనం వృధా అవుతుంది అంటూ మండలికి తలకొరివి పెట్టాడు తనయుడు జగన్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు లోకేశ్.





Untitled Document
Advertisements