జగన్ సర్కార్‌కి షాకిచ్చిన హైకోర్ట్..

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 08:10 AM

ఏపీ సర్కార్‌కి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ సారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీ జెండా రంగులే దర్శనమిస్తున్నాయి. పంచాయితీ భవనాలు, వాటర్ ట్యాంకులు, స్మశానాలు ఇలా అన్నిటిని వైసీపీ రంగులతో పూతలు వేయించారు. అయితే తాజాగా రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

అయితే పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో దాఖలైన పిటీషన్‌పై నేడు విచారణ జరిగింది. త్వరలో పంచాయితీ ఎన్నికలు రాబోతుండడంతో పార్టీ రంగులు పంచాయితీ కార్యాలయాలపై తొలగించాలని, పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వంకు సంబంధించినవని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్ట్ తేల్చి చెప్పింది. అయితే పంచాయితీ భవనాలకు రంగులు తొలగింపచేసే బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాలని, దీనిపై ఎన్నికల సంఘాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది.





Untitled Document
Advertisements