ఏపీ పరిణామాలను చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం తెలీడంలేదు

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 09:21 AM

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసనమండలిని రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అయితే బిల్లు ఆమోదం పొందలేదని మండలినే రద్దు చేయడం సరికాదని, లోక్ సభలో బిల్లి ఆమోదం పొంది రాజ్యసభలో బిల్లు తిరస్కరించడం, బిల్లి సెలెక్ట్ కమిటీకి పంపడం వంటివి జరిగాయని అలా అని ఏ ప్రధాని రాజ్యసభను రద్దు చేయాలని, పెద్దల సభ సలహాలు అక్కర్లేదనో అనలేదని చెప్పుకొచ్చారు.

అయితే ఎన్ని రాజధనులు పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ప్రస్తుతం ఏపీ పరిణామాలను చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదని అన్నారు. కేసీఅర్‌తో దోస్తీ చేయడం వలనే జగన్ ఇలాంటి సలహాలు తీసుకుంటున్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని, కేసీఆర్ నమ్మబలికి గొంతు కోస్తారని ఆయనతో దోస్తీ జగన్‌కి అంత మంచిది కాదని అన్నారు. అయితే కేసీఆర్ సలహాలను పాటిస్తూ ముందుకు వెళితే మాత్రం జగన్‌కి చీకటి తప్ప వెలుగు అనేదే ఉండదని ఏపీ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుందని అన్నారు.





Untitled Document
Advertisements