విలన్ పాత్రలో నాని ... లుక్ అద్దిరిపోయిందిగా

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 11:10 AM

నేచురల్ స్టార్ నాని మరొక కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. అయితే నాని ఇప్పటివరకు చేసిన సినిమాలు క్లాస్, మాస్ పాత్రలే. అయితే అష్టాచెమ్మా చిత్రం తో నాని వెండితెరకి పరిచయ మయ్యారు. ఆ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం జెంటిల్మెన్, ఈ చిత్రంలో నాని కొన్ని సన్నివేశాల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలా కనిపిస్తారు. ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో సుదీర్ బాబు హీరోగా నటిస్తుండగా, నాని ప్రతినాయక ఛాయలున్న విలన్ పాత్రలో నటిస్తున్నారు.

అయితే తాజాగా విడుదల అయిన సుదీర్ బాబు లుక్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో రాక్షసుడి పాత్రని పోషిస్తున్న నాని ఫస్ట్ లుక్ విడుదల అయిన వెంటనే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నాని లుక్ కి అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నివేద థామస్, అదితి రావు హైదరి లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 25 న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

Untitled Document
Advertisements