క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్న సౌతాఫ్రికా ఆల్ రౌండర్

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 11:10 AM

క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్న సౌతాఫ్రికా ఆల్ రౌండర్

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వెర్నర్ ఫిలాండర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గో టెస్టు ముగిసిన తర్వాత తన క్రికెట్ కెరీర్ గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ టెస్టులో సౌతాఫ్రిక ఓడిపోయింది. ఫిలాండర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 224 వికెట్లు పడగొట్టాడు. 30 వన్డేల్లో 41 వికెట్లు ,ఏడు టీ20ల్లో నాలుగు వికెట్లు తీశాడు. 2011 నవంబర్‌లో కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆస్ట్రేలియాతో టెస్టులో అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 15 వికెట్లకు 5 పరుగులు చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆ మ్యాచ్ ఫిలాండర్ కెరీర్ తో మరవలేనిది.

Untitled Document
Advertisements