నేడు నిర్భయ దోషి రిట్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:01 PM

నేడు నిర్భయ దోషి రిట్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం

నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నేడు విచారించనుంది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో.. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, అత్యవసరంగా తన వాదనలు వినాలంటూ.. ముకేశ్ సుప్రీంను ఆశ్రయించాడు. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ చేపట్టనుంది. 2012 నాటి నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నలుగుర్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం. వీరికి ఉరి శిక్ష జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు వీరిని తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు. ఈ మేరకు డెత్ వారంట్ కూడా జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో ముకేశ్ కుమార్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. జనవరి 17న దాన్ని ఆయన తిరస్కరించారు. ‘ఎవరైనా ఉరి శిక్షను ఎదుర్కోబోతున్నారంటే.. దానికి మించి అత్యవసరమైంది మరొకటి లేద’ని ముకేశ్ పిటిషన్‌పై విచారణ జరిపే విషయమై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. బోబ్డేతోపాటు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో ఢిల్లీలో నిర్భయను దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ప్రయివేట్ భాగాల్లో తుప్పు పట్టిన ఇరుప రాడ్ పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారు. సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ కేసులో ఆరుగుర్ని దోషులుగా తేల్చారు. మైనర్ అయిన ఒకరు మూడేళ్లపాటు శిక్ష అనుభవించి బయటకు రాగా.. మరొకరు జైళ్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.Untitled Document
Advertisements