దారుణం...కూతురితో కాపురం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!!!

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:16 PM

దారుణం...కూతురితో కాపురం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!!!

కన్న కూతురితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న మూఢనమ్మకంతో ఓ వ్యక్తి పైశాచానికి పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ ఘటన చెన్నై సమీపంలోని ఆవడి పట్టణంలో వెలుగుచూసింది. ఆవడి పట్టణానికి చెందిన అరుళ్‌ అనే వ్యక్తి(40)కి కుమార్తె(16) ఉంది. ఈ నెల 24వ తేదీన ఆ బాలిక పోలీసులకు ఫోన్ చేసి తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లిన పోలీసులు విచారించగా అరుళ్ పదేళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నట్లు చుట్టపక్కల వాళ్లు చెప్పారు. ఆరు నెలలకు ఓ సారి నామక్కల్‌ జిల్లా కొల్లిమలైకి వెళ్లి ధ్యానం చేస్తుంటాడని చెప్పారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో అరుళ్ ఇంట్లో లేదు. దీంతో కుటుంబసభ్యులతో అతడికి ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. విచారణలో కూతురిని లైంగికంగా వేధించినట్లు నిందితుడు అంగీకరించాడు. కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తన ఆయుష్షు పెరుగుతుందని ఓ స్వామీజీ చెప్పారని, అందుకే ఇలా చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మూఢనమ్మకంతో కూతురి జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన అరుళ్‌పై స్థానికులు మండిపడుతున్నారు.





Untitled Document
Advertisements