సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సీఎం

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:50 PM

సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సీఎం

అక్రమాస్తుల కేసులో హాజరు తప్పనిసరంటూ సీబీఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో.. ఈ వ్యవహారంలో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎంగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్లో పేర్కొన్న జగన్.. సీబీఐ వాదన సరికాదన్నారు. నేడు (మంగళవారం) ఈ పిటిషన్‌ విచారణకు రానుంది. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు కూడా జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. జగన్ పదే పదే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం పట్ల సీబీఐ న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా.. ఏవో కారణాలు చెబుతూ ప్రతివారం న్యాయస్థానానికి హాజరు కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. సీఎం అయ్యాక తొలిసారి జనవరి 10న సీబీఐ కోర్టు ముందు జగన్ విచారణకు హాజరయ్యారు. తర్వాతి రెండు వారాలూ కారణాలు చెప్పి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది.Untitled Document
Advertisements