ఫిబ్రవరిలో 'లోకల్ బాయ్'

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:11 PM

ఫిబ్రవరిలో 'లోకల్ బాయ్'

తమిళ స్టార్ హీరో ధనుష్ లోకల్ బాయ్ విడుదలకు రెడీ అయ్యింది. తమిళ ‘పటాస్’ చిత్రాన్ని తెలుగులో లోకల్ బాయ్ పేరుతో విడుదల చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'పటాస్'‌ (లోకల్ బాయ్) చిత్రానికి ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. స్నేహ మరో హీరోయిన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు సతీష్ కుమార్ తెలిపారు. నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. తమిళంలో సంక్రాంతికి విడుదలై సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ధనుష్ నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్... సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ధర్మ యోగి' తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది" అని అన్నారు.







Untitled Document
Advertisements