కేశవనాథ స్వామి ఆలయ ప్రతిష్టాపన పోస్టర్ విడుదల

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:31 PM

కేశవనాథ స్వామి ఆలయ ప్రతిష్టాపన పోస్టర్ విడుదల

శ్రీ కేశవనాథ స్వామి ఆలయం పునః ప్రతిష్టాపనకు ముస్తాబవుతోంది ..కొమురం భీం జిల్లాలో ముఖ్యమైన ఆలయాల్లో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది .కేశవా నాథ స్వామి ఆలయ ప్రతిష్టాపనకు సంభందించిన పోస్టర్లను సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జెడ్పీ చైర్ పెర్సన్ కోవా లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఫిబ్రవరి 13,14,15 తేదీల్లో నిర్వహించే ఆలయ ప్రతిష్టాపన కార్యక్రామానికి వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖా ఈవో బాపిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ కనా యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు వైరాగాడే మనోజ్ , ప్రకాష్ చంద్ర మసాడే , నిమ్మకంటి సుగునాకర్, వారణాసి లక్ష్మణ్ రావ్, వెంకట్ రవీందర్, గుండి సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.Untitled Document
Advertisements