నేడు కూడా దిగొచ్చిన ఇంధన ధరలు

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:57 PM

నేడు కూడా దిగొచ్చిన ఇంధన ధరలు

దేశీ ఇంధన ధరలు ఈ రోజు కూడా కిందికి దిగాయి. పెట్రోల్ ధర 12 పైసలు, డీజిల్ ధర 14 పైసలు చొప్పున దిగొచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.78.26కు క్షీణించింది. డీజిల్ ధర కూడా రూ.72.60కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.86కు క్షీణించింది. డీజిల్‌ ధర 14 పైసలు క్షీణతతో రూ.71.87కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.77.50కు క్షీణించింది. డీజిల్ ధర 14 పైసలు క్షీణతతో రూ.71.53కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.73.60కు క్షీణించింది. డీజిల్ ధర 13 పైసలు క్షీణతతో రూ.66.58కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.79.21కు క్షీణించింది. డీజిల్ ధర 14 పైసలు క్షీణతతో రూ.69.79కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.36 శాతం తగ్గుదలతో 58.37 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.30 శాతం క్షీణతతో 52.98 డాలర్లకు తగ్గింది.





Untitled Document
Advertisements