శామ్‌‌సంగ్ ఎస్‌‌20 సిరీస్‌‌ ఫోన్లు విడుదల

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 05:14 PM

శామ్‌‌సంగ్ ఎస్‌‌20 సిరీస్‌‌ ఫోన్లు విడుదల

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీ శామ్‌‌సంగ్ తన లేటెస్ట్‌‌ ఫ్లాగ్‌‌షిప్‌‌ సిరీస్‌‌ ఫోన్లు ‘ఎస్‌‌20, ఎస్‌‌20+, ఎస్‌‌20 అల్ట్రా’లను అమెరికాలో విడుదల చేసింది. ఇదే కార్యక్రమంలో గెలాక్సీ జెడ్‌‌ ఫ్లిప్‌‌ ఫోన్‌‌ను కూడా లాంచ్‌‌ చేసింది. 5జీ, ఏఐ కెమెరా టెక్నాలజీ, 16జీబీ ర్యామ్‌‌, క్వాల్‌‌కామ్ 865 ప్రాసెసర్‌‌ వీటి ప్రత్యేకతలు. ధరలు వెయ్యి డాలర్ల (దాదాపు రూ. 71,300) నుంచి 1,399 (దాదాపు రూ.98,400) డాలర్ల వరకు ఉన్నాయి. వచ్చే నెల ఆరు నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఇండియా కస్టమర్లు కూడా ప్రి ఆర్డర్‌‌ కోసం రిజిస్టర్‌‌ చేసుకోవచ్చు.

Untitled Document
Advertisements