టీ20 కెప్టెన్‌ని మార్చండి: డయానా

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 07:00 PM

టీ20 కెప్టెన్‌ని మార్చండి: డయానా

భారత మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్‌ని వెంటనే మార్చేయాలని మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జి డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా వేదికగా బుధవారం ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో అలవోకగా గెలిచేలా కనిపించిన భారత్ జట్టు.. ఆఖర్లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో.. టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుని నడిపించడంలో విఫలమవుతోందని అభిప్రాయపడిన ఎడుల్జి.. కెప్టెన్సీ ప్రభావం ఆమె బ్యాటింగ్‌పైనా పడుతోందని వెల్లడించారు. 156 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ మంధాన (66: 37 బంతుల్లో 12x4) హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ జట్టు అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. కీలక సమయంలో మంధాన ఔటవగా.. భారత్ విజయానికి 35 బంతుల్లో 41 పరుగులు అవసరమయ్యాయి. కానీ.. ఈ దశలో ఒత్తిడికి గురైన భారత్ టీమ్ ఆఖరికి 144 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగుల వద్దే పేలవంగా ఔటైపోవడంతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్, జెమీమా చేతులెత్తేశారు. హర్మన్‌ తన సహజసిద్ధమైన ఆట ఆడాలంటే..? కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలేమో..? ఆమె ఎందుకో ఇటీవల ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ.. ఆమె పక్కకి తప్పుకుంటే.. ఎవరు కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరిస్తారు..? మంధానాకి అవకాశమిస్తే.. అది ఆమె బ్యాటింగ్‌పై ఆ ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ.. హర్మన్‌‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది’ అని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు.

Untitled Document
Advertisements