"కాంగ్రెస్ పార్టీ తల్లి-కొడుకు పార్టీ , TRS తండ్రి-కొడుకు పార్టీ"

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 07:09 PM


రిజరవేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. 2012లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే SC,ST ఉద్యోగుల ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించవద్దని కోర్టు కు వెళ్లిందని.. ఆ అంశంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం రిజర్వేషన్లు కల్పించేది లేదని ప్రకటించిందన్నారు. రిజర్వేషన్లు కల్పించవద్దంటూ కోర్టుకు పోయిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే అంశంపై ధర్నా చేస్తామనడం అవివేకమని, దళితులపై ముసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తప్పుచేసిన కాంగ్రెస్.. బీజేపీని బదనాం చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని, తెలంగాణ లో కూడా కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకుంటే మంచిదని చెప్పారు లక్ష్మణ్. దళితులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే.. బీజేపీ మాత్రం దళితులకు అండగా ఉంటుందన్నారు. దళితులకు ఎవరేమి చేశారో తేల్చేందుకు ఉత్తమ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తల్లి కొడుకు పార్టీ అని, TRS తండ్రి,కొడుకు పార్టీ అని అన్నారు లక్ష్మణ్.





Untitled Document
Advertisements