ట్రోఫీని విరగొట్టిన యశస్వి జైశ్వాల్

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 07:55 PM

ట్రోఫీని విరగొట్టిన యశస్వి జైశ్వాల్

బంగ్లాదేశ్‌తో గత ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ ఓటమితో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సహనం కోల్పోయాడు. టోర్నీలో టాప్ స్కోరర్‌గా జైశ్వాల్ నిలవగా.. అతనికి ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీమెంట్’ అవార్డు లభించింది. కానీ.. ఓటమి బాధలోనే దాన్ని తీసుకున్న జైశ్వాల్.. అనంతరం రెండుగా విరగొట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో ఏకంగా 400 పరుగులు నమోదు చేశాడు. అతని స్కోర్లు ఓసారి పరిశీలిస్తే..? 88, 105 నాటౌట్, 62, 57 నాటౌట్, 29 నాటౌట్, 59‌ పరుగులు. కానీ.. అంత కష్టపడినా ఫైనల్లో పేలవ బ్యాటింగ్, బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో జైశ్వాల్ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫీని కూడా అతను పగలగొట్టినట్లు తెలుస్తోంది. ట్రోఫీని విరగొట్టడంపై జైశ్వాల్ కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ ‘ఇదేం మొదటిసారి కాదు.. అయినా.. జైశ్వాల్ పరుగులపై శ్రద్ధ పెడతాడు తప్ప.. ఇలాంటి ట్రోఫీలపై కాదు’ అని వెనకేసుకొచ్చాడు. ఎడమచేతి ఓపెనర్ కావడంతో శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి జైశ్వాల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.





Untitled Document
Advertisements