బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియామకం అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 09:07 PM

బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియామకం అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

బ్రిటన్ (యూకే) ఫైనాన్స్ మినిస్టర్ గా ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌ నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్‌ జావిద్‌ తన పదవికి రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. రిషి సునక్ భారత సంతతికి చెందిన వ్యక్తి. వయసు 39 సంవత్సరాలు. తండ్రి డాక్టర్. బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్నారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ యూనివర్శిటిలో పరిచయమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి.. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ ఓ డైరెక్టర్.





Untitled Document
Advertisements