మార్కెట్లోకి రానున్న బీఎస్6 టీవీఎస్ ఎక్స్ఎల్, స్పోర్ట్ బైక్స్

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 11:08 AM

మార్కెట్లోకి రానున్న బీఎస్6 టీవీఎస్ ఎక్స్ఎల్, స్పోర్ట్ బైక్స్

గ్రామాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 బండి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. 'మనూరి బండి.. మొనగాడి బండి' అంటూ ప్రజల ఆదరణ చూరగొంది. పొలం పనులు, ఇంటి అవసరాలకు మనదేశంలోని గ్రామస్థులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు. అదే విధంగా టీవీఎస్ స్పోర్ట్ బైక్ నూ యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రెండు మోటార్ సైకిళ్లను టీవీఎస్ సంస్థ బీఎస్4 నుంచి బీఎస్6 ఫార్మాట్లోకి మారుస్తుంది. ఇప్పటికే టీవీఎస్ సిటీ 100, ప్లాటినా, స్టార్ సిటీ ప్లస్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసిన టీవీఎస్ తాజాగా తన స్పోర్ట్, ఎక్స్ఎల్ 100 మోటార్ సైకిళ్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసేందుకు సిద్ధమైంది. త్వరలో బీఎస్6 మోడళ్లను విడుదల చేయనున్న టీవీఎస్ సంస్థ అధికారికంగా ధరను ప్రకటించినప్పటికీ విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం టీవీఎస్ ఎక్స్ఎల్ 100 వెల రూ.43,044, టీవీఎస్ స్పోర్ట్ బండి ధర రూ. 51,750లుగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే టీవీఎస్ ఎక్స్ఎల్ 100 రూ.3,500 అధికం కానుంది. టీవీఎస్ స్పోర్ట్ మోడల్ ధరలో అయితే 5000 రూపాయలు వ్యత్యాసముంది. రిటైల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ స్పెషల్ ఎడిషన్ బండి రూ.43,804లకు దొరుకుతుంది. ధరల అంశం కాకుండా ఈ మోటార్ సైకిళ్ల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టీవీఎస్ ఎక్స్ఎల్ ఇంజిన్ దగ్గరకు వస్తే బీఎస్4 మోడల్ మాదిరే ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న అప్ డేట్లు మినహా పెద్ద మార్పులేమి ఇందులో ఉండకపోవచ్చు. గత మోడల్ 99.7సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగిఉండి 4.3పీఎస్ పవర్, 6.5ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టెలిస్కోపిక్ వేరియంట్, వెనకవైపు హైడ్రాలిక్ షార్క్ అబ్జార్బర్స్ లాంటివి వాటిలో కొత్త మోడల్లోనూ మార్పులు ఉండకపోవచ్చు. బీఎస్4 టీవీఎస్ స్పోర్ట్ మోడల్ కూడా 99.7సీసీ ఇంజిన్ కలిగి ఉండి 7.4పీఎస్ పవర్7.8ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉన్న ఈ బండి ట్యూబ్ టైర్, మ్యానువల్ గేర్ సస్పెన్షన్ తో పనిచేస్తుంది. రెండు మోటార్ సైకిళ్లూ మెరుగైన మైలేజినిస్తాయి. టీవీఎస్ ఎక్స్ఎల్ లీటరుకు 67 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. టీవీఎస్ స్పోర్ట్ మోడల్ అయితే లీటరుకు 95 కిలోమీటరు వరకు ఇస్తుంది. వీటిని గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రజలు విరివిగా వాడుతూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.

Untitled Document
Advertisements