హార్ధిక్ పటేల్ కనిపించడం లేదు..భార్య ఆందోళన

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 11:10 AM

హార్ధిక్ పటేల్ కనిపించడం లేదు..భార్య ఆందోళన

పాటీదార్ కమ్యూనిటీ లీడర్ హార్ధిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకుగాను సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. హార్దిక్ 20రోజులుగా కనిపించడంలేదని… గుజరాత్ అధికార యంత్రాంగం తన భర్తను టార్గెట్ చేసిందని కింజల్ తెలిపారు. ప్రస్తుతం హార్ధిక్ ఎక్కడున్నది తెలువడంలేదని.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వీడియోలో చెప్పింది. 2017లో పటేళ్లపై ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం మాఫీచేస్తుందని చెప్పిందని.. కాగా మిగితా పటేళ్లపై కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం హార్ధిక్ పై ఉన్నకేసులను అలాగే ఉంచిందని తెలిపారు. హార్ధిక్ ను ప్రజలతో కలువకుండా, వారి తరపున పోరాడకుండా గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. హార్ధిక్ చివరిసారి ఈ నెల 11వతారీఖున ఢిల్లీ ఎన్నికలలో గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ కు ట్విటర్ వేధికగా శుభాకాంక్షలు చెప్పారని అన్నారు కింజల్. అయితే.. నాలుగేళ్ల కిందట గుజరాత్ పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని హార్ధిక్ ఈనెల 10న ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తనను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు వచ్చినపుడు తాను ఇంట్లో లేనని… ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే తనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని అన్నారు. తనను నిర్బంధించేందుకే గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements