మేడారం జాతర 2020: ఆదాయం రూ.11.5 కోట్లు

     Written by : smtv Desk | Wed, Feb 26, 2020, 01:11 PM

మేడారం జాతర 2020: ఆదాయం రూ.11.5 కోట్లు

12 రోజులుగా కొనసాగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు మంగళవారంతో ముగిసింది. నోట్ల ఆదాయం మొత్తం 502 హుండీలకు రూ. 11.18 కోట్లు, చిల్లర పైసలు రూ. 32.66 లక్షలు కలిపి మొత్తం రూ.11.5 కోట్ల ఆదాయం వచ్చింది. బంగారం 1.06 కిలోలు, వెండి 53.45 కిలోలు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఫారిన్​ కరెన్సీ వివరాలు బుధవారం ప్రకటిస్తామని డిప్యూటీ కమిషనర్​ఆఫ్ ​ఎండోమెంట్ వరంగల్ అధికారి నర్సింహులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం 1.25 కోట్లు వచ్చింది. మంగళవారం 13 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. రూ. 1.25 కోట్లు, బంగారం 291 గ్రాములు, వెండి 14 కిలోలు వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 82 లక్షల ఆదాయం వచ్చింది. హుండీలతో రూ. 26.06 లక్షలు, ఆర్జిత సేవ, అభిషేకం, ప్రసాదాల టికెట్ల ద్వారా రూ. 55.94 లక్షల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం కంటే ఈసారి రూ. 18.68 లక్షల ఆదాయం అదనంగా సమకూరినట్లు ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్ శర్మ తెలిపారు.





Untitled Document
Advertisements