హైదరాబాద్ లో సీఐఐ ఇనోవేషన్ సెంటర్ ఏర్పాటు

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 03:09 PM

హైదరాబాద్ లో సీఐఐ ఇనోవేషన్ సెంటర్ ఏర్పాటు

సీఐఐతో కలిసి తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ లో సెంటర్‌ ఫర్‌ ఇనొవేషన్‌‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచేసెంటర్‌ కార్యకలాపాలు మొదలు పెట్టనుంది.యువ ఎంట్రప్రెనూర్లకు అవసరమైన సర్వీసెస్‌‌ను ఈసెంటర్‌ అందిస్తుంది. ముఖ్యంగా స్టార్టప్స్‌‌ ఏర్పాటులో చురుకైన పాత్ర పోషిస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాలలోని కంపెనీలకూ సెంటర్‌ ఫర్‌ ఇనొవేషన్‌‌ తన సర్వీసెస్‌‌ అందిస్తుంది. సీఐఐ నేషనల్‌ స్టార్టప్‌ కౌన్సి ల్‌ ఛైర్మన్‌‌ ఎస్‌‌ గోపాలక్రిష్ణన్‌‌ (ఇన్ఫోసిస్‌‌ మాజీ ఫౌండర్) నెలకొల్పిన ప్రతీక్షట్రస్ట్‌‌, తెలంగాణ ప్రభుత్వం కలిసి సెంటర్‌ బాధ్యతలు చేపడతాయని ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌‌ చెప్పారు. స్టార్టప్స్‌‌కు అవసరమైన మెంటరింగ్‌‌తోపాటు, ఇతరసర్వీ సెస్‌‌నూ సెంటర్‌ ఫర్‌ ఇనొవేషన్‌‌ అందిస్తుందని తెలిపారు. పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలను స్టార్టప్స్‌‌కు కల్పిస్తదని పేర్కొన్నారు. ఇనొవేషన్‌‌లో ముందడుగు వేసే కంపెనీలను ఆకట్టుకోవడంపై సెంటర్‌ దృష్టి పెడుతుందని జయేష్‌ రంజన్‌‌ చెప్పారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమం సైడ్ లైన్స్ లోమీడియాతో జయేష్​ రంజన్ మాట్లాడారు.





Untitled Document
Advertisements