పవన్-క్రిష్ సినిమాలో విలన్ ఇతనే...

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 04:10 PM

పవన్-క్రిష్ సినిమాలో విలన్ ఇతనే...

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటుకోవాలని అనుకుంటున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేసారు. సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా అంటే విలన్ పాత్ర ఆయన రేంజ్‌కు సరిపోయేలా ఉండాలి. అందుకే ఈసారి విలన్‌ను బాలీవుడ్‌ నుంచి తెప్పించాలని అనుకుంటున్నారట క్రిష్. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను క్రిష్ తెలుగులోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే హిందీ నటులు కూడా ఉంటే బాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది క్రిష్ ఆలోచన. అర్జున్ రాంపాల్‌కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. విలన్ పాత్రల్లో బాగా ఒదిగిపోతారు. ఆయన చూపుల్లోనే విలనిజం ఉంటుందని అంటారు. కాస్త తెలుగు డైలాగులు బాగా బట్టీ పట్టి చెప్పగలిగితే.. పవన్‌కు సమానంగా పేరు తెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కానీ ఇంకా ఈ విషయంలో సినిమా టీం నుంచి క్లారిటీ రావాలి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ ఇమేజ్‌ క్రేజ్‌ తగ్గ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఓ సందేశాత్మక కథను క్రిష్ సిద్ధం చేశారట. ప్రముఖ యాంకర్ అనసూయ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు కూడా డైలాగులు రాస్తున్నారు. గతంలో క్రిష్ సాయి మాధవ్‌తో కలిసి ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి కలిసి పనిచేసారు. సాయి బాబా కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఏఎం రత్నం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements