ఈ నెల 29 మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు రైతుల దీక్ష...?!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 06:18 PM

ఈ నెల 29 మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు రైతుల దీక్ష...?!

మెగాస్టార్ చిరంజీవిని అమరావతి రైతులు టార్గెట్ చేశారా.. ఏకంగా చిరు ఇంటి ముందే ధర్నాకు సిద్ధమయ్యారా.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ పేరుతో ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు దీక్షకు దిగుతామని ఈ పోస్టర్‌లో ప్రకటించారు. ఈ నెల 29 (ఆదివారం) న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని చిరు ఇంటి ముందు దీక్ష చేస్తామంటున్నారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు చిరంజీవి మద్దతు తెలపాలని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ కోరింది. అమరావతి మద్దతుదారులు తమ దీక్షకు సంఘీభావం తెలపాలని.. దీక్షను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని జేఏసీ ప్రకటించడం ఆసక్తికరంగా మారగా.. నిజంగానే అమరావతి జేఏసీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారా లేదా అన్న అంశంపై క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం పోస్టర్ వైరల్ అవుతోంది. అంతకముందే మెగాస్టార్ సీఎం జగన్‌ను అమరావతి వెళ్లి మరీ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మూడు రాజధానులపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రాజధానులకు అనుకూలమని గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి మాత్రమే కాదు కొద్దిరోజుల క్రితం హీరో మహేష్ బాబు, హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అమరావతి స్టూడెంట్ జేఏసీ ధర్నాకు దిగింది. అమరావతి టాలీవుడ్ సెలబ్రిటీలు ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్‌ను వినిపించారు. ఒకవేళ వారు మద్దతు ఇవ్వకపోతే వారి సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి ఇంటి ముందు దీక్షకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చిరంజీవి ఇంటిని అమరావతి జేఏసీ నేతలు ముట్టడిస్తారని.. దీక్ష చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో.. మెగా ఫ్యామిలీ అభిమానులు మండిపడుతున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు చిరంజీవి గారిని ఆహ్వానించారా.. ఏ రోజైన తెలుగుదేశం ప్రభుత్వం చిరంజీవి గారిని అధికార కార్యక్రమాలు పిలిచిందా.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆయన ఇంటిముందు ఎలా నిరసన తెలుపుతారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇదంతా టీడీపీ చేయిస్తోందని ఆరోపిస్తున్నారు.





Untitled Document
Advertisements