యాడ్స్‌లోకి వచ్చేసిన హీరో సుశాంత్

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 06:57 PM

యాడ్స్‌లోకి వచ్చేసిన హీరో సుశాంత్

అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా పరిచయమైన సుశాంత్.. ‘కరెంట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ తరవాత వరుస డిజాస్టర్లతో డీలా పడ్డారు. 2018లో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ ఒక పాత్ర చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లోకి కూడా వచ్చేశారు. శీతల పానీయం ‘స్ర్పైట్’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సుశాంత్ ఇప్పుడు ‘స్ర్పైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్‌కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్‌లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ‘స్ర్పైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ‘స్ర్పైట్’కు ఇప్పటి వరకు తెలుగులో నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతకు ముందు నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి సంయుక్తంగా చేశారు. ఇప్పుడు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. ఈ సమ్మర్‌కు తన యాడ్స్‌తో తెలుగు ప్రజలను ‘స్ర్పైట్’ వైపు తిప్పే బాధ్యతలు సుశాంత్ భుజంపై వేశారు. అందుకే ‘‘డౌట్స్ తుడిచెయ్.. స్ర్పైట్ తెరిచెయ్’’ అంటున్నారు సుశాంత్.


Untitled Document
Advertisements