ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సోనియా!!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 07:06 PM

ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సోనియా!!

ఢిల్లీ అల్లర్లు, హింసాకాండపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. సోనియా నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ పరిణామాలను రాంనాథ్ కోవింద్ కు వివరించారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని కోరింది కాంగ్రెస్. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే అల్లర్లు జరిగాయన్నారు సోనియా గాంధీ. హింసాకాండ జరుగుతున్నా ఢిల్లీ సర్కార్ ప్రేక్షక పాత్ర వహించిందన్నారు . అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర విఫలమైందన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఢిల్లీ ప్రజలకు భద్రత కల్పించేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు.

Untitled Document
Advertisements