పుట్టగొడుగులతో షుగర్​కు చెక్!!!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 07:16 PM

పుట్టగొడుగులతో షుగర్​కు చెక్!!!

ఈ సూపర్ ఫాస్ట్​ కాలంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంకా క్లియర్​గా చెప్పుకోవాలంటే… బీపీ, షుగర్​లు ఉండటం ఇప్పుడు చాలా మామూలు విషయం అయిపోయింది. అంతలా ఇవి మన ఆరోగ్యాల మీదకి ఎటాక్​ చేస్తున్నాయి. మనం కూడా రెడీ అయి వాటిని కంట్రోల్​ చెయ్యకపోతే చాలానే ఇబ్బందులు పడాలి. డయాబెటిస్​ని కంట్రోల్​ చేసే ముఖ్యమైన వాటిలో పుట్టగొడుగులు కూడా ఒకటి. డయాబెటిస్‌‌ను నియంత్రించడానికి పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర చాలా తక్కువస్థాయిలో ఉంటాయి. అంతే కాకుండా యాంటీ డయాబెటిక్​ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కాలేయంలో స్రవించే గ్లూకోజ్​ని నియంత్రించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. గౌట్​లోని సూక్ష్మజీవుల చర్యను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్​ ఉన్నవారు… శరీరంలోని షుగర్​ లెవల్స్​ను కంట్రోల్ చేయడానికి మెట్​ఫార్మిన్​ని తీసుకుంటారు. కానీ దీనికి బదులుగా పుట్టగొడుగులను ఉపయోగించొచ్చు. ఇవి దాదాపు అదే స్థాయిలో షుగర్​ లెవల్స్​ను కంట్రోల్ చేస్తాయి. పైగా సహజమైన ఆహారపదార్ధం అవ్వడంతో, సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండే అవకాశం కూడా లేదు. పుట్టగొడుగుల ద్వారా అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పైగా తక్కువ కేలరీలు ఉండటం మనకి కలిసొచ్చే మరో అంశం. ఇవి గుండె పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడతాయి.

Untitled Document
Advertisements