వెస్టిండీస్‌పై లంక అతిపెద్ద విజయం

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 08:15 PM

వెస్టిండీస్‌పై లంక అతిపెద్ద విజయం

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే శ్రీలంక సాధించింది. తాజాగా హంబ‌న్‌టోట‌లో జ‌రిగిన మ్యాచ్‌లో 161 ప‌రుగుల‌తో లంక విజ‌యం సాధించింది. విండీస్‌పై ప‌రుగుల ప‌రంగా ఇదే అతిపెద్ద విజ‌యం కావ‌డం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లంక‌.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల‌కు 345 ప‌రుగులు చేసింది. ఫెర్నాండో (127) టాప్ స్కోర‌ర్‌. అనంత‌రం ఛేద‌న‌లో విండీస్‌ 184 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. షాయ్ హోప్ (51) అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. అంత‌కుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 345 ప‌రుగులు చేసింది. ఫెర్నాండోపాటు కుశాల్ మెండిస్ (119) సెంచ‌రీతో రాణించాడు. వీరిద్ద‌రూ మూడో వికెట్ 239 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. విండీస్ బౌల‌ర్ల‌లో షెల్డ‌న్ కొట్రెల్ (4/67), జోసెఫ్ (3/57) రాణించారు. ఛేద‌న‌లో విండీస్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యం వైపు సాగ‌లేదు. వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓట‌మిని మూట‌గట్టుకుంది. హోప్ ఒక్క‌డే ఫిఫ్టీతో ఒంట‌రిపోరాటం చేశాడు. లంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా (3/30), సంద‌కన్ (3/57) స‌త్తాచాటారు. ఈ విజయంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో 2-0తో లంక ఆధిక్యంలో నిలిచింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య చివ‌రిదైన మూడో వ‌న్డే వ‌చ్చేనెల 1వ తేదీన క్యాండీలో జ‌రుగుతుంది.

Untitled Document
Advertisements