ఈ బుడ్డోడికి ఎంతకోపమో.. నెట్టింట్లో వైరల్ బేబీ

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 08:19 PM

ఈ బుడ్డోడికి ఎంతకోపమో.. నెట్టింట్లో వైరల్ బేబీ

అప్పుడే పుట్టిన ఓ బేబీ నెట్టింట్లో వైరల్ గా మారింది. మన పుట్టుకతోనే మన కష్టాలు మొదలయ్యాయని చాలామంది భావిస్తారు. కానీ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది ఓ చిన్నారి. అప్పుడే పుట్టిన చిన్నారి ‘మీరు నన్నుఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకువచ్చారు’ అని అర్ధం వచ్చేలా కోపంగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ప్రపంచాన్ని నవ్వులు పూయించేలా చేస్తుంది.

బ్రెజిల్ కు చెందిన డయాన్ డి, జీసస్ బార్బోసాలు భార్య భర్తలు. బార్బోసా గర్భవతి. ఫిబ్రవరి 22న సీ-సెక్షన్ చేసేందుకు డాక్టర్లు టైం ఇచ్చారు. అయితే బార్బోసాకు పురిటి నొప్పులు రావడంతో ఫిబ్రవరి 13న ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తమకు పుట్టబోయే బిడ్డను ఫోటోలు తీయాలంటూ ఆ దంపతులు స్థానికంగా ఫోటో గ్రాఫర్ గా ఉన్న రోడ్రిగో కుంస్ట్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.సాధారణంగా శిశువు పుట్టిన వెంటనే డాక్టర్లు లంగ్స్ లో కానీ శరీరంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెక్ చేసేందుకు వీపు నిమురుతారు. వీపు నిమిరినప్పుడు శిశువు ఏడిస్తే ఆరోగ్యం గా ఉన్నట్లు కన్ఫాం చేస్తారు. బార్బోసా పుట్టిన శిశువు ఏడవలేదు. కనీసం కళ్లు కూడా తెరవలేదు. అయితే బొడ్డుతాడు కట్ చేస్తే తాను ఫోటోలు తీస్తానని రోడ్రిగో డాక్టర్లను కోరాడు. దీంతో ఫోటోలు తీసేందుకు వీలుగా ఉంటుందని డాక్టర్లు బొడ్డు తాడు కట్ చేశాడు. దీంతో పాప ఏడుపు లంకించుకుంది. అంతేకాదు ఏడుపుకు ముందు పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను ఫోటోగ్రాఫర్ రోడ్రిగో 10ఫోటోల్ని క్యాప్చర్ చేశాడు. ప్రస్తుతం ఆ పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలపై బార్బోసా మాట్లాడుతూ ‘నా బిడ్డ ధైర్యంగా జన్మించింది’. డైపర్‌ లు, డ్రెస్ లు చేంజ్ చేసేటప్పుడు నుదిటిపై ముడతలు వచ్చేలా క్యూట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుందంటూ తెగసంబరపడి పోతుంది.

Untitled Document
Advertisements