వాట్సాప్ లో ఎవరికీ తెలియని 5 ట్రిక్స్!

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 04:43 PM

వాట్సాప్ లో ఎవరికీ తెలియని 5 ట్రిక్స్!

వాట్సాప్.. ప్రపంచంలోనే అత్యంత ఎంతో పేరు పొందిన మెసేజింగ్ యాప్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం భారతదేశంలోనే వాట్సాప్ కు దాదాపు 40 కోట్ల యాక్టివ్ యూజర్లున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగించేందుకు వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ, వినియోగదారులకు ఉత్తమ పనితీరుని అందిస్తూ ప్రజాదరణ పొందుతూ ఉంది. వాట్సాప్ లో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లలో వాయిస్, వీడియో కాల్స్ ప్రముఖమైనవి. ఎంతోకాలంగా ప్రజల్ని ఊరిస్తూ వచ్చిన డార్క్ మోడ్ ను కూడా ఈమధ్యనే బీటా వెర్షన్ ను అందించారు. త్వరలోనే ఇది సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి త్వరలోనే సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెసేజ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే వాట్సాప్ లో ఎక్కువ మందికి తెలియని ట్రిక్స్ ను తెలుసుకోండి!

​1. మిమ్మల్ని ఎవరైన కావాలని దూరం పెడుతున్నారనుకుంటున్నారా?

నిజానికి మీరు పంపే మెసేజ్ లను, అవతలి వారు చదివారో లేదో తెలుసుకోడానికి వాట్సాప్ లో బ్లూ టిక్స్ బటన్ ఎలాగో అందుబాటులో ఉంది. అయితే ఎదుటివారు మీ మెసేజ్ లను చదవకుండా మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది.

✪ వాట్సాప్ యాప్ లో చాట్‌బాక్స్ ఓపెన్ చేయండి.
✪ మీరు ఎవరి చాట్ ను పరిశీలించాలనుకుంటున్నారో ఆ చాట్ ను ఓపెన్ చేయండి.
✪ అందులో వారు చదవని మీ మెసేజ్ ను ఎంచుకుని దాన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సెలక్ట్ చేయండి.
✪ కుడివైపు పైభాగంలో మీకు కనిపించే మూడు చుక్కల ఐకాన్ పై క్లిక్ చేయండి.
✪ అంతే ఆ వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు రీచ్ అయిందో, దాన్ని వారు ఎప్పుడు చదివారో కూడా మీరు తెలుసుకోవచ్చు.
✪ అయితే ఈ ట్రిక్ ను మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉపయోగించవచ్చు.
✪ మీ మెసేజ్ ని గ్రూప్ లో ఎంతమంది చదివారో తెలుసుకోవచ్చు.

​2. టైప్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్ లు పంపవచ్చు ఇలా!

గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు వాట్సాప్ లో ఇన్ స్టంట్ టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ లను పంపవచ్చు. ఓకే గూగుల్ లేదా హే గూగుల్ అనడం ద్వారా మీరు మీ వాయిస్ అసిస్టెంట్ కు లేదా గూగుల్ అప్లికేషన్ ఉపయోగించైనా, ఈ వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత, మీరు మెసేజ్ ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నేమ్ ను చెప్పడం ద్వారా ఈ మెసేజ్ ను పంపవచ్చు. అంతేకాకుండా ఆ మెసేజ్ చదవడానికి ఆ యాప్ ను ఓపెన్ చేయమని కూడా అడగవచ్చు.

​3. ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడవచ్చు!

వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా మరే ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లకు సంబంధించినవి అయిన రెండు వేర్వేరు అకౌంట్లను ఉపయోగించాలని అనుకుంటున్నారా? అయితే పారలల్ స్పేస్, డ్యూయల్ స్పేస్, 2అకౌంట్స్ వంటి మొబైల్ అప్లికేషన్స్ ను మీరు ఉపయోగించవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ అప్లికేషన్స్ లేనట్లయితే, మీరు వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ లో ఏదైనా ఒకదాన్ని ఇన్‌స్టాల్ చేసి, దానికి అవసరమైన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత, రెండో వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ లేదా టెలిగ్రామ్ అకౌంట్స్ ను మీరు ఇందులో ఉపయోగించవచ్చు. కొన్ని కంపెనీల మొబైల్ ఫోన్లు, తమ కస్టం యూజర్ ఇంటర్ఫేస్లో భాగంగా ఈ ఫీచర్ ని ముందుగానే పొందుపరుస్తున్నాయి. యాప్ క్లోనర్ వంటి ఫీచర్లు ఇందుకు ప్రధాన ఉదాహరణ.

​4. వాట్సాప్‌లో నకిలీ లైవ్ లొకేషన్ పంపండిలా!

ఇందుకోసం మీరు జిపీఎస్ స్పూఫింగ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ ఫోన్‌లో ముందస్తుగా డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. అందులో “Select mock location app” ఆప్షన్ ను ఎంచుకోండి. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా జీపీఎస్ ఎమ్యులేటర్ అప్లికేషన్ ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసి మీరు పంపాలనుకుంటున్న ఫేక్ లొకేషన్ పేరును టైప్ చేసి, జీపీఎస్ ఎమ్యులేటర్‌ ఆన్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌లో చాట్ ఓపెన్ చేసి అనంతరం లొకేషన్ మీద క్లిక్ చేసి లైవ్ లొకేషన్‌ ను ఎంచుకుని దాన్ని షేర్ చేయండి. ఆ అప్లికేషన్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్నంత సేపు, మీరు ఆ ప్రదేశంలో ఉన్నట్లుగానే చూపిస్తుంది. ఇదే పద్దతి లొకేషన్ షేరింగ్ చేయగల అన్ని అప్లికేషన్లకు వర్తిస్తుంది.

​5. మీడియాతో సహా వాట్సాప్ చాట్‌ను పూర్తిగా సేవ్ చేయండి!

చాట్ విండోను ఓపెన్ చేసి అందులో “మోర్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందులో మీరు పర్సనల్ లేదాగ్రూప్ చాట్‌ను ఎక్స్ పోర్ట్ చేయవచ్చు. మీరు ఎక్స్పోర్ట్ చాట్ ఆప్షన్ నొక్కిన తర్వాత, మీకు “Without Media” లేదా “With Media” అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ టెలిగ్రామ్, జీమెయిల్ మాదిరిగానే, వాట్సాప్ చాట్ ను కూడా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ చాట్‌లను బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు వాట్సాప్‌లో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేశాక సెట్టింగ్స్ ను ఎంచుకోవాలి. అందులో చాట్స్ ను ఎంచుకుని చాట్ బ్యాకప్ పై క్లిక్ చేయండి. అంతే మీ చాట్ బ్యాకప్ అవుతుంది.





Untitled Document
Advertisements