భీష్మ ఫస్ట్ వీక్ కలెక్షన్స్... రూ. 50 కోట్లు

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 05:40 PM

భీష్మ ఫస్ట్ వీక్ కలెక్షన్స్... రూ. 50 కోట్లు

నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద భీష్మ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగిస్తోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 21) విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10 కోట్లు.. నాలుగు రోజుల్లో రూ. 16.71 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తొలివారం ముగిసేనాటికి ఆక్యుపెన్సీ పెంచుకుని వరల్డ్ వైడ్ రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కాగా భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ సినిమా రూ. 23 కోట్లకు మార్కెట్ చేయగా.. తొలి ఐదురోజుల్లోనే ఖర్చుపెట్టిన మొత్తం వచ్చేసింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగగా.. వైజాగ్‌లో 29న ‘భీష్మ’ విజయోత్సవ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు దక్కడంతో విజయోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే నిర్మాణ సంస్థ నుండి పవన్ రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Untitled Document
Advertisements