ఢిల్లీ అల్లర్లు... బ్రాహ్మాణ కుటుంబానికి అండగా ముస్లింలు

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 06:10 PM

ఢిల్లీ అల్లర్లు... బ్రాహ్మాణ కుటుంబానికి అండగా ముస్లింలు

దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పటికీ కొన్నిచోట్ల హిందూ-ముస్లింలు అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకున్నారు. శివ్ విహార్ లో అల్లరి మూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కంటికి కనబడినవన్నీ ధ్వంసం చేసుకుంటూ పోయాయి. కానీ.. స్థానిక హిందూముస్లిం ప్రజలు మాత్రం ఐకమత్యం చాటారు. ఆలయాలు, మసీదులు ధ్వంసం కాకుండా కాపాడారు. అడ్డుగా నిలబడి.. ఇందిరా విహార్ దగ్గరున్న ఓ ఆలయాన్ని .. రెండు వర్గాల ప్రజలు కలిసి కాపాడుకున్నారు. అల్లర్లు జరిగిన రోజు ముస్లింలే తమ ఇంటికి వచ్చి ధైర్యాన్ని ఇచ్చారని.. ఢిల్లీలోని ఓ బ్రాహ్మణ కుటుంబం తెలిపింది. న్యూ ముస్తఫాబాద్ లోని నెహ్రూ విహార్ లో… ముస్లిం జనాభా చాలా ఎక్కువ. అక్కడ కేవలం మూడు నాలుగు హిందూ కుటుంబాలే ఉన్నాయి. అయినప్పటికీ.. అల్లర్ల సమయంలో చుట్టూ ఉన్న ముస్లింలు తమకు భద్రతపై భరోసా ఇచ్చారని చెప్పాడు రామ్ సేవక్ శర్మ. 35 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామనీ.. బాధ, సంతోషాలు పంచుకుంటామని చెప్పాడు. బయటనుంచి వచ్చినవారే అల్లర్లకు పాల్పడ్డారని తమ ఏరియాలోని ముస్లింలు కలిసిమెలిసి ఉంటామని తెలిపారు స్థానికులు.

Untitled Document
Advertisements