పిల్లల దగ్గర అస్సలు ఉండకూడని వస్తువులు...

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 07:11 PM

పిల్లల దగ్గర అస్సలు ఉండకూడని వస్తువులు...

పిల్లల గది అన్నప్పుడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉన్నప్పటికీ అందులో పిల్లలు వేళ్లు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. ప్లగ్ పాయింట్స్‌ని కచ్చితంగా మూసివేయండి. వీటితో పాటు గృహావసరాలకు వాడే కత్తి, కత్తిపీట, చాకు, బ్లేడు, కత్తెరలు ఇలాంటివి వారికి దూరంగా ఉంచాలి. కొంతమంది తల్లులు వండిన పాత్రలను వారికి దగ్గరగా పెడతారు. అప్పుడే వండిన పాత్రలను కూడా పెడుతుంటారు. ఇలాంటివి పెట్టడం వల్ల వాటిని పిల్లలు ముట్టుకుంటారు. మీద ఒలుకుతాయి. అందుకే అలా కాకుండా వాటికి దూరంగా పెట్టాలి. అసలు వారిని వంటగదిలోకి వేళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే, కిచెన్‌లో వేడి నూనె వంటివి ఉంటాయి. వీటి గురించి పిల్లలకు తెలియదు. దాన్ని ముట్టుకోవడం చేస్తుంటారు. దీంతో.. అది పిల్లలపై ఒలికే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ అలా చేయకండి. అదేవిధంగా, పెద్దవారు వాడే మందులు, మెడిసిన్స్ వారికి అందే విధంగా పెట్టొద్దు. వాటి గురించి పిల్లలకు తెలియకుండా నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు చిల్లర డబ్బులు, యాసిడ్ బాటిల్స్‌ని కూడా వారి దగ్గర పెట్టకపోవడమే మంచిది. ఇలాంటివాటితో కొంత మంది ఇళ్లల్లో నీటి తొట్లు ఉంటాయి. వాటి నుంచి నీటిని తోడుకుంటారు. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు వాటి దగ్గరే ఉంచడం మంచిది. ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఆడుతూ వాటి దగ్గరికి వస్తారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తైన వెంటనే మళ్లీ మూతలు పెట్టాలి. కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది. వీటితో పాటు ల్యాప్‌టాప్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ కూడా వారి దగ్గర పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే వీటి గురించి పిల్లలకి తెలియదు. వారు కొత్తగా కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాటితో ఆటలాడుతారు. ఒక్కోసారి వాటిని పైనుంచి కిందపడేస్తారు. దీని వల్ల విలువైన వస్తువులు పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా చేయకూడదు. దీని వల్ల వేలల్లో నష్టం జరుగుతుంది. ఈ విషక్ష్ాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవడం మంచిది.





Untitled Document
Advertisements