ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమైన రోజా...?

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 08:16 PM

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమైన రోజా...?

తన పదవికి రాజీనామా చేసేందుకు సై అంటున్నారు ఎమ్మెల్యే రోజా. విశాఖలో విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్రజలు చంద్రబాబును అడ్డుకుంటే.. నిందలు తమ పార్టీపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. విశాఖ ఘటనకు సంబంధించి వీడియోలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. అందులో ఎక్కడైనా కడప రౌడీలు కనిపిస్తే.. తాను రాజీనామాకు సిద్ధమన్నారు. టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు రోజా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు.. టీడీపీ హయాంలో ఎంత అవినీతి, ఎంత అరాచకం జరిగిందో ఈ సంఘటన ఉదాహరణగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన సామాజిక వర్గంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ.. అధికారులను భయభ్రాంతులకు గురిచేయిస్తున్న వారు వీధి రౌడీలు కాదా అన్నారు. గతంలో తనను నిర్బంధించి కాన్వాయ్‌లో ఎక్కడకు తీసుకు వెళ్లారో కూడా అంతు చిక్కకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజ్యాంగం పట్ల నిబద్దత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందన్నారు. ఆయనకు చట్టాలు ఇవాళ గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా లోక్‌ష్‌ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే. ఇక సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో ఓ రైతు పాస్‌బుక్‌ కోసం లక్ష రూపాయలు ఇచ్చానని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసి, అభివృద్ధిని అడ్డుకుని, వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబు మళ్లీ ఆ ప్రాంతానికి వెళితే ఎలా స్వాగతిస్తారనేది కూడా తెలియదా అన్నారు.

Untitled Document
Advertisements