ఈపీఎఫ్‌వో శుభవార్త...ఈ నెలలోనే అకౌంట్‌లోకి డబ్బులు!

     Written by : smtv Desk | Tue, Mar 24, 2020, 01:17 PM

ఈపీఎఫ్‌వో శుభవార్త...ఈ నెలలోనే అకౌంట్‌లోకి డబ్బులు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా కఠిన నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన సబ్‌స్క్రైబర్లకు భరోసా ఇస్తోంది. పెన్షనర్లకు కరెక్ట్ టైమ్‌కే లేదంటే ఇంకా ముందుగానే పెన్షన్ డబ్బులు అందుతాయని తీపికబురు అందించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. కోవిడ్ 19 వల్ల దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ఈపీఎఫ్‌వో ప్రయత్నిస్తోంది. మార్చి 25 నాటి కల్లా పెన్షనర్ల వివరాలను, వారి పెన్షన్ అమౌంట్ డీటైల్స్‌ను రెడీ చేయాలని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇప్పటికే ఈపీఎఫ్‌వో ఫీల్డ్ ఆఫీస్‌లకు ఆదేశాలు పంపింది. సాధారణంగా మార్చి 31న పెన్షన్ పంపిణీ వివరాలు బ్యాంకులకు వెళ్తాయి. అంతేకాకుండా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పెన్షన్ డబ్బులను ముందుగానే బ్యాంకులకు అందజేయాలని ఆదేశించింది. దీంతో పెన్షనర్ల అకౌంట్లలోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. మార్చి నెలలోనే వారికి డబ్బులు అందుతాయి. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 కింద 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ప్రతి నెలా పెన్షన్ డబ్బులు అందిస్తున్నామని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయంగా 16 వేల మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇంకా 3 లక్షల మందికి పైగా ఇది సోకింది. మన దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 500కు పైగా చేరింది. కరోనా వైరస్ వల్ల దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.





Untitled Document
Advertisements