ప్రియుడి మోజులో తల్లి...కొడుకు ముఖంపై మూత్రం పోసి.. 17 పక్కటెముకలు విరగ్గొట్టి....దారుణం!

     Written by : smtv Desk | Fri, Mar 27, 2020, 03:43 PM

ప్రియుడి మోజులో తల్లి...కొడుకు ముఖంపై మూత్రం పోసి.. 17 పక్కటెముకలు విరగ్గొట్టి....దారుణం!

అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిందో రాక్షసి. ప్రియుడి మోజులో పడి తన ఐదేళ్ల కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపేసింది. ప్రియుడితో కలసి అతి దారుణంగా హింసించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ బాలుడి ఒంటిపై మూత్రం పోసి దాష్టీకానికి పాల్పడినా నోరుమెదపకుండా చూస్తూ ఊరుకుంది. అనంతరం అతను చిన్నారిని కొట్టమని ఆదేశించగానే విచక్షణా రహితంగా కన్నకొడుకుని చావబాదింది. ఆ దెబ్బలకు చిన్నారి పక్కటెముకలు విరిగిపోయి అచేతనంగా పడి ఉన్నా కనీసం జాలి కలగలేదు. ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న కొడుకును అలాగే వదిలేయడంతో నెమ్మదిగా అవయవాలు పనిచేయడం మానేసి.. చివరకి ప్రాణాలు విడిచాడు. అనంతరం కన్నింగ్ ప్లాన్ వేసిందా కసాయి తల్లి. హత్యను ఆకస్మిక మరణంగా చూపేందుకు హైడ్రామా నడిపించింది. అత్యవసర సేవలకు ఫోన్ చేసి తన కొడుకు పడిపోయాడని.. అపస్మారక స్థితిలో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అవేవీ ఫలించకపోవడంతో దోషిగా కోర్టు ఎదుట నిలబడింది. చిన్నారిపై జరిగిన దాష్టీకాన్ని తెలుసుకున్న కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ తల్లికి కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యూఎస్‌లోని చికాగోకి చెందిన 26 ఏళ్ల జాక్వెలిన్ రాంబర్ట్ అనే మహిళ తన మాజీ ప్రియుడితో కలసి ఐదేళ్ల కొడుకుతో నివాసం ఉండేది. భర్త నుంచి విడిపోయిన జాక్వెలిన్.. ట్రి హెండర్సన్ అనే వ్యక్తితో సహజీవనం చేసేది. ప్రియుడితో కలసి కన్నకొడుకుపైనే దాష్టీకానికి పాల్పడింది. ప్రియుడు కూడా తరచూ ఆమె కొడుకుని కొడుతూ ఉండేవాడు. ఓ రోజు ఇద్దరూ కలసి చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడు హెండర్సన్ బాలుడిని కొట్టడమే కాకుండా అతని ఒంటిపై మూత్రం పోసి నీచంగా ప్రవర్తించాడు. ప్రియుడడు తన కొడుకుపై మూత్రం పోస్తున్న సమయంలో తల్లి పక్కనే ఉంది. అనంతరం ప్రియుడు సైగ చేయడంతో ఆమె కూడా కొడుకును చావబాదింది. జాక్వెలిన్ కొడుకు పట్ల రాక్షసంగా వ్యవహరించింది. కొడుకుని దారుణంగా కొట్టి హింసించింది. చిన్నారి పక్కటెములకలు విరిగిలా కొట్టింది. ఏకంగా 17 చోట్ల పక్కటెముకలు విరిగిపోయాయి. తీవ్ర హింసకు గురైన చిన్నారి కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోవడంతో అతని అవయవాలు పాడయ్యాయి. చివరికి అతను ప్రాణాలు విడిచాడు. కొడుకు చనిపోయే ముందు కసాయి తల్లి నేరం నుంచి తప్పించుకునేందుకు దారుణమైన ప్లాన్ వేసింది. అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి తన కొడుకు అచేతంగా పడిపోయాడని కొత్తడ్రామాకు తెరతీసింది. అయితే ఆమె ఆటలు సాగలేదు. చిత్రహింసల కారణంగానే బాలుడి మరణించినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. విచారణ ప్రారంభించిన న్యాయస్థానం నేరాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రియుడితో కలసి ఆమె పెట్టిన చిత్రహింసలను విన్న న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. త్యాగం, నిస్వార్థమైన తల్లి ప్రేమకు కళంకం తెచ్చిన కసాయి తల్లికి కఠిన శిక్ష విధించింది. ఆమెపై నమోదైన ఒక్కొక్క అభియోగానికి యాభై ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కన్నకొడుకుని హింసించి.. అతని చావుకు కారణమైన కేసులో నిందితురాలు నేరం ఒప్పుకోవడంతో ఏకంగా 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక్కో అభియోగానికి 50 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. అయితే ఆ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి.





Untitled Document
Advertisements