డ్యూయల్ రోల్ లో కనిపించనున్న పవన్ కళ్యాణ్..!

     Written by : smtv Desk | Sat, Mar 28, 2020, 11:14 AM

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నప్పటి నుండి సినిమాలను వదిలేశాడు. తాజాగా వకీల్ సాబ్ అంటూ ఫస్ట్ లుక్ నీ విడుదల చేసి సినీ అభిమానులనీ అలరించాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో పాటుగా మరొక రెండు చిత్రాలను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఒక దాని తర్వాత మరొకటి చేస్తూ బిజీ గా ఉన్న తరుణం లో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో పవన్ ఇంటికే పరిమితం అయ్యారు.

తాజాగా దర్శకులతో విడివిడిగా చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ చిత్ర విషయంలో పలు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. అయితే ఈచిత్రంలో పవన్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఒక పాత్రలో బందిపోటు దొంగ లా కనిపించనున్నారు. ఈ విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరొక పాత్ర ఏమిటనేది ప్రస్తుతం సస్పెన్స్. అయితే తీన్ మార్ చిత్రంలో డ్యుయల్ రోల్ లో కనిపించిన పవన్ మరొకసారి ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.





Untitled Document
Advertisements