క‌రోనాపై బ్రావో సాంగ్...వైరల్ వీడియో

     Written by : smtv Desk | Sat, Mar 28, 2020, 07:12 PM

క‌రోనాపై బ్రావో సాంగ్...వైరల్ వీడియో

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మంచి సింగర్ అన్న సంగతి కూడా తెలిసిందే. కరుణా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న వేళ ఆ వైరస్‌పై తాజాగా బ్రావో ఒకసాంగ్‌ను రూపొందించాడు. నెవెర్ గివ్‌ అప్ పేరుతో తాను రూపొందించిన ఈ పాటను సోషల్ మీడియాకు రిలీజ్ చేశాడు. నెటిజన్లంతా వెంటనే స్పందించడంతో ఈ పాట ఇన్స్‌స్టంట్‌గా హిట్టయ్యింది. ప్రమాదకరమైన వైరస్ పై పోరాటం సాగించాలని బ్రావో ఈ సంద‌ర్భంగా సూచించాడు. అలాగే వైర‌స్‌ను ఎదుర్కొనేందుకుగాను, చేతులను పలుమార్లు శుభ్రపరచుకోవడంతో పాటు ఇళ్ల‌ల్లోనే గడపాలని పేర్కొన్నాడు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ వ్యాధిని అంతమొందించేందుకు ప్రజలంతా తమ వంతు సహకారాన్ని అందించాలని పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా వైర‌స్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్‌ కార్యకలాపాలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనేక మంది క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడ్డాయి. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఈనెల 29 నుంచి ప్రారంభించాల్సి ఉండగా.. మార్చి నెల 15 వరకు పోస్ట్ పోన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 22 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది.






Untitled Document
Advertisements