స్మిత్ కెప్టెన్సీపై ముగిసిన నిషేధం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 10:44 AM

స్మిత్ కెప్టెన్సీపై ముగిసిన నిషేధం

దక్షిణాఫ్రికా గడ్డపై రెండేళ్ల క్రితం బాల్ టాంపరింగ్ ఆస్ట్రేలియా క్రికెట్‌ని కుదిపేసింది. అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్ కామెరూన్ బెన్‌క్రాప్ట్ కలిసి ఈ బాల్ టాంపరింగ్‌కి పాల్పడినట్లు విచారణలో తేలడంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకుంది. సీనియర్లుగా టీమ్‌లో ఉండి తప్పు చేసిన డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్‌పై 12 నెలలు నిషేధం విధించిన సీఏ.. బెన్‌క్రాప్ట్‌పై 9 నెలలు నిషేధం వేటు వేసింది. బాల్ టాంపరింగ్‌కి వ్యూహకర్తగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ఎప్పటికీ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకి కెప్టెన్‌ కాబోడని ప్రకటించిన సీఏ.. స్టీవ్‌స్మిత్ కెప్టెన్సీపై రెండేళ్ల నిషేధం విధించింది. దాంతో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టిమ్ పైనీ అందుకోగా.. వన్డే, టీ20 కెప్టెన్సీ అరోన్ ఫించ్ చేతికి వచ్చాయి. కానీ.. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా జట్టుని సమర్థంగా నడిపించడంలో విఫలమయ్యారు. అయితే.. తాజాగా స్టీవ్‌స్మిత్ కెప్టెన్సీపై సీఏ విధించిన రెండేళ్ల నిషేధం గడువు ముగిసింది. దీంతో.. మళ్లీ రేసులోకి స్మిత్ వచ్చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీ వికెట్ కీపర్ డికాక్, డేవిడ్ వార్నర్ మధ్య టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌తో మొదలైన గొడవ.. ఆఖరికి నిషేధం వరకూ వెళ్లింది. ఎలాగైనా ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాని ఓడించాలని కంకణం కట్టుకున్న డేవిడ్ వార్నర్.. స్టీవ్‌స్మిత్‌ పర్యవేక్షణలో బెన్‌క్రాప్ట్‌తో బాల్ టాంపరింగ్ చేయించాడు. శాండ్ పేపర్ జేబులో పెట్టుకున్న బెన్‌క్రాప్ట్ ఓవర్ మధ్యలో బంతిని ఆ పేపర్‌తో రుద్దుతున్న వీడియో స్టేడియంలోని పెద్ద తెరలపై ప్రసారమైంది.





Untitled Document
Advertisements