ఉద్యోగులకు శుభవార్త...రూ.2,000 అదనపు వేతనం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 12:19 PM

ఉద్యోగులకు శుభవార్త...రూ.2,000 అదనపు వేతనం

కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కోవిడ్ 19 కూడా శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా సోకిన వారి సంఖ్య దాదాపు 1000కి చేరింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ ఉద్యోగులకు మాత్రం ప్రత్యేకంగా వర్క్ ఎట్ హోమ్ వంటి సదుపాయాలు లేవు. వాళ్లు బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అదనపు వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి.


దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాక్ డౌన్‌లోనూ పనిచేస్తున్న ఉద్యోగులకు అదనపు వేతనం అందిస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు పని చేసిన ఉద్యోగులకు ఈ బెనిఫిట్ అందుతుంది. ఎస్‌బీఐ బ్రాంచ్‌లో పనిచేస్తున్న దాదాపు ప్రతి ఉద్యోగికి ఈ సదుపాయం లభిస్తుంది.


అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు రూ.2,000 చొప్పున అందజేస్తోంది. ఈ డబ్బులతో మాస్క్‌లు, గ్లోవ్స్, శానిటైజేషన్లు కొనుగోలు చేయాలని సూచించింది. అంతేకాకుండా రోజులకు కనీసం 5 ట్రాన్సాక్షన్లు నిర్వహించే బీసీ ఏజెంట్లకు రూ.100 అందిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 4 వరకు ఈ ఫెసిలిటీ పొందొచ్చు.

కాగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మరణించారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్ 6 లక్షల మందికి పైగా సోకింది. అత్యధికంగా అమెరికాలో కరోనా పేషంట్లు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇకపోతే మన దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 1000 దగ్గర ఉంది.





Untitled Document
Advertisements