ప్రపంచాన్ని వ‌ణికించిన‌ వైరస్ లు...

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 01:18 PM

ప్రపంచాన్ని వ‌ణికించిన‌ వైరస్ లు...

వైరస్ ఎప్పుడూ డేంజరే. ఏ రూపంలో అయినా ఎటాక్ చేయొచ్చు. జంతువుల ద్వారా దాడి చేయొచ్చు. గాల్లో కలిసిపోయి రావచ్చు. కంట్రోల్ చేద్దామంటే వ్యాక్సిన్ లుం డవు.ఈ మహమ్మారి గురిం చి అవగాహన పెంచు కునేలోగానే వందలు, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతారు. ఆ మధ్య వచ్చిన ఎబోలా కావచ్చు. నిన్న వచ్చిన నిఫా కావచ్చు. మధ్యమధ్యలో జనాన్ని వణికిం చిన స్వైన్ ఫ్లూ లాంటి వి, లేటెస్ట్గా వచ్చిన కరోనా కావచ్చు. ఏదైనా యమ డేం జరే. ప్రపంచాన్ని వణికిం చిన ప్రమాదకర వైరస్ లు కొన్ని…

*‘నిఫా’:

రెండేళ్ల క్రితం నిఫా వైరస్ కేరళలో చాలా ఎక్కువగా సోకింది. ఈవైరస్ మలేసియా, సింగపూర్ లలో వందలాది మందిని బలి తీసుకుంది.2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్ లోకి, అక్కడి నుంచి పశ్చిమ బెం గాల్లోకి ప్రవేశించింది. 2018లో కేరళను కుదిపేసింది. మలేసియాలో1999లో నిఫా వైరస్ ను తొలిసారి గుర్తిం చారు. ఆ తరువాతసిం గపూర్ లోకి ఎంటరైంది. ఈ వైరస్ బారినపడి ఈ రెండు దేశాల్లోనూ వందమందికి పైగా చనిపోయారు.

*జికా :

జికా వైరస్ 2017లో మన దేశాన్ని తాకింది. మొదట రాజస్థాన్ లోని జైపూర్ లో దీని తీవ్రతను గుర్తించారు. దాదాపుగా 100మందివరకు జికా బారినపడ్డారు. పొరుగున ఉన్న గుజరాత్ లోనూ ఇది ఎఫెక్ట్ చూపించింది. జికా వైరస్ ను1947లో ఉగాండాలో తొలిసారి గుర్తించారు. ఆ తరువాత అమెరికాసహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 86దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది.

*ఆంత్రాక్స్..:

గొర్రెల నుం చిమనిషికి ఆంత్రాక్స్ సౌత్ ఇండియాపై ఎక్కువగావిరుచుకుపడిన వైరస్ లలో ఆంత్రాక్స్ ఒకటి. ఛత్తీస్ గఢ్ లో 2007లో దీనిని గుర్తిం చారు. అక్కడి నుం చి ఇతర చోట్లకు ఇది పాకింది. ఆంత్రాక్స్ ఒక అంటు వ్యాధి. ‘బాసిల్లస్ ఆంత్రాక్స్ ’అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెల నుంచి మనుషులకు వస్తుంది. దీంతో ఆంత్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు.

*ఎబోలా:

మూడు నాలుగేళ్ల క్రితం ఎబోలా వైరస్ పేరు చెబితే ఆఫ్రికా వణికిపోయింది. 2013 నుంచి 2016 వరకు పశ్చి మాఫ్రికాలో ఈవైరస్ బాగా విస్తరించింది. ఎబోలా.. ఇది ఒక డేం జరస్ వైరస్. ఆఫ్రికాలో పుట్టి ప్రపంచాన్నివణికించింది. ఎబోలా వైరస్ ను 1976లో తొలిసారి గుర్తించారు. సౌత్ సూడాన్ లోని జారా అనే ఒక పట్టణంలోని ఈ వైరస్ ను గుర్తించారు. ఎబోలా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా సలైవా(చొంగ) ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

*డెంగీ:

డెంగీ వైరస్ ప్రభావం మన దేశంలో 2016లో బాగా ఎక్కువగా పడింది. న్యూఢిల్లీ, కేరళలో దాదాపు 1500
మందికి సోకినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. డెంగీ జ్వరాలు సోకని రాష్ట్రం లేనే లేదు. 1970కు ముందు డెంగీ వైరస్ కేవలం తొమ్మిది దేశాలలోనే ఉండేది. అయితే, ఆ తరువాత ఈ వైరస్ వంద‌ దేశాల్లో విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కిందటేడాది ప్రపంచంలోని అనేక
ప్రాంతాల్లో డెంగీ మరోసారి విజృంభించింది. బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ను గుర్తించారు. ఎబోలా వైరస్జంతువుల నుంచి మనుషుల కువ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా సలైవా(చొం గ) ద్వారా ఇతరులకువ్యాపిస్తుంది.





Untitled Document
Advertisements