సినీ కార్మికులకు మాస్ మహారాజ రూ.20 లక్షల సాయం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 01:58 PM

సినీ కార్మికులకు మాస్ మహారాజ రూ.20 లక్షల సాయం

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా మూతపడింది. షూటింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మికుల కోసం ప్రముఖ సినీ స్టార్స్ తమ వంతు సాయాన్నిఅందిస్తున్నారు. వారి కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అగ్రహీరోల నుంచి కుర్ర హీరోల వరకు అంతా తమవంతు సాయంగా తోచినంత విరాళం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రూ20 లక్షలు సాయం ప్రకటించారు. సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తున్నానన్నాడు. పనుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు రవితేజ. లాక్ డౌన్ తో రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కోసం ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దగ్గుబాటి ఫ్యామిలీ తరపున రాణా, వెంకటేష్, సురేష్ బాబు కోటి రూపాయాలు విరాళం అందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్, తారక్ రూ. 25 లక్షలు ఇచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని… అందరూ ఇంటిలోనే ఉండి విధిగా పాటించాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రవితేజ అభిమానులు ఆయన విరాళంపై ప్రశంసలు అందిస్తున్నారు. నాలుగు మూవీలు వరుసగా ప్లాప్ అయినా.. కూడా 20 లక్షలు అందించిన నువ్వు సూపర్ అంటూ రవితేజపై ట్వీట్లు వేస్తున్నారు. ఈ ట్వీట్ కోసమే వెయిట్ చేస్తున్నామంటూ మరికొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. నువ్వు రియల్ హీరో అన్న ప్లాప్స్‌లో కూడా ఇంత పెద్ద సాయం చేశావు అంటూ మరికొందరు రవితేజ అభిమానులు ప్రశంసలతో ఆయనను ముంచెత్తుతున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ సినిమా డిస్కో రాజా కూడా బాక్స్ ఫీస్ వద్ద బోల్తా పడింది.







Untitled Document
Advertisements