ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 03:47 PM

కరోనా వైరస్ భూతం ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6,64,695 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 30,847గా ఉంది. 1,46,156 మందికి కరోనా నయమైంది. అయితే ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ భయానకంగానే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలోనే సంభవించాయి. అక్కడ 92,472 పాజిటివ్ కేసులు ఉండగా, 10,023 మంది మరణించారు. మరో యూరప్ దేశం స్పెయిన్ లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. స్పెయిన్ లో 73,235 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 5,982 మంది మృత్యువాత పడ్డారు.

ఆసియా అగ్రదేశం చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య 81,439, మరణాల సంఖ్య3,300గా ఉంది. ఇరాన్ లో 35,408 పాజిటివ్ కేసులు నమోదవగా, 2,517 మందిని మృత్యువు కబళించింది. ఫ్రాన్స్ లోనూ పరిస్థితి భీతావహంగానే ఉంది. ఇప్పుడక్కడ 2,314 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు వదిలినట్టు గుర్తించారు. అక్కడ పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 37,575కి పెరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షదాటింది. మరణాల సంఖ్య గత మూడురోజుల్లో రెట్టింపైంది. అమెరికాలో 1,23,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,211 అని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.





Untitled Document
Advertisements