ప్రైమ్‌లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'...బాబు, లోకేష్ లకు ఆర్జీవి రిక్వెస్ట్

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 05:01 PM

ప్రైమ్‌లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'...బాబు, లోకేష్ లకు ఆర్జీవి రిక్వెస్ట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఆయన రకరకాల ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస పనిలో పడ్డారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు , లోకేష్ కూడా క్వారంటైన్‌లో ఉన్నారన్నారు వర్మ. అందుకే వాళిద్దరు అమేజన్ ప్రైమ్‌లో ఉన్న ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూడాలని కోరారు. అంతేకాదు ఆ సినిమా చూసి వారిద్దరు తనకు ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వాలన్నారు వర్మ. మరసారి వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ మారుతోంది. అప్పుడు వర్మ ట్వీట్ పై నెటిజన్స్ స్పందించడం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్లను ఎందుకు కదుపుతున్నావని ప్రశ్నిస్తున్నారు. కొందరు లోకేష్‌కు ట్యాగ్ చేసే దమ్ములేదా అని కూడా అడుగుతున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమా విషయంలో టీడీపీ వర్మపై అనేక రకాల విమర్శలు చేసింది. ర్మ కూడా ఈ సినిమాలో చంద్రబాబును, లోకేష్‌ను నెగిటివ్ క్యారెక్టర్లతో చూపించారని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. అయితే ఇప్పుడు వర్మ మరోసారి చంద్రబాబును లోకేష్‌ను ఆ సినిమా చూడాలంటూ ట్వీట్ చేయడంతో ఇప్పుడు మరోసారి అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరపైకి వచ్చింది.






Untitled Document
Advertisements