వీరూ రెండో ట్రిపుల్ సెంచరీకి @12 ఏళ్లు

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 05:53 PM

వీరూ రెండో ట్రిపుల్ సెంచరీకి @12 ఏళ్లు

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. భార‌త క్రికెట్ జ‌ట్టు ఎన్నో ఏళ్లుగా ఎదురూచూసిన ట్రిపుల్ సెంచ‌రీ లోటును తీర్చిన వ్య‌క్తి సెహ్వ‌గే. సునీల్ గావ‌స్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌లాంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కానీ ఈ ఘ‌న‌త‌ను త‌న‌దైన శైలిలో సెహ్వాగ్ సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై తొలిసారిగా ట్రిపుల్ సెంచ‌రీ సాధించిన సెహ్వాగ్‌.. మ‌రో నాలుగేళ్ల‌కే అంటే 2008లో ద‌క్షిణాఫ్రికాపై ఈ ఫీట్‌ను మరోసారి రిపీట్ చేశాడు. అది కూడా స‌రిగ్గా ఈ రోజు (మార్చి 29న‌) కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి, ప్రొటీస్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు. స‌ఫారీల‌తో చెన్నైలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ విధ్వంస‌క‌ర రీతిలో రెచ్చిపోయాడు. కేవ‌లం 304 బంతుల్లోనే 319 ప‌రుఉగుల సాధించాడు. సెహ్వాగ్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోరు కావ‌డం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, ఐదు సిక్స‌ర్లను బాదాడు. అయితే ఈ మ్యాచ్‌ను ప్రొటీస్ అతి క‌ష్టంమీద డ్రాగా ముగిసింది. ఇక త‌న తొలి ట్రిపుల్ సెంచ‌రీని (309) మార్చి 29నే వీరూ సాధించాడు. ఇలా రెండు ట్రిపుల్ సెంచ‌రీల‌ను త‌ను ఒకే రోజున నమోదు చేశాడు. మ‌రోవైపు రెండు ట్రిపుల్ సెంచ‌రీలు చేసిన నాలుగో ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఇక సెహ్వాగ్ 2009లో శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టులో 293 ప‌రుగులు చేసి త్రుటిలో మ‌రో ట్రిపుల్ సెంచ‌రీని కోల్పోయాడు. ఇక ఇంగ్లాండ్‌పై 2016లో క‌రుణ్ నాయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేసి.. సెహ్వాగ్ త‌ర్వాత ఈ ఫీట్‌ను చేసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా నిలిచాడు.





Untitled Document
Advertisements