కేంద్రానికి కంపెనీల విన్నపం...కరోనా దెబ్బకి గగ్గోలు!

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 05:05 PM

కేంద్రానికి కంపెనీల విన్నపం...కరోనా దెబ్బకి గగ్గోలు!

కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ కూడా ఇందులో భాగమే. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు, పరిశ్రమ వర్గాలు ఆర్థిక సంవత్సరాన్ని కూడా పొడిగించాలని మోదీ సర్కార్‌కు కోరుతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్‌ని మూడు నెలల పాటు పొడిగించాలని, 15 నెలలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని 2020 జూన్ వరకు పొడిగించాలని కోరుతున్నాయి. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం చూస్తే.. వచ్చే ఆర్థిక సంవత్సరం జూలై నుంచి ప్రారంభమై 2021 మార్చితో ముగుస్తుంది. సాధారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియాల్సి ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. కోవిడ్ 19 వల్ల చాలా కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిశ్రమ వర్గాలతో చర్చలు జరుపుతోంది. ట్యాక్స్ డెడ్‌లైన్ పొడిగించినా కూడా కంపెనీలపై ఒత్తిడి కొనసాగుతోందని, అందువల్ల వాటికి అవసరమైన కాలాన్ని అందించాలని ధ్రువ అడ్వైజర్స్ సీఈవో దినేశ్ కానబర్ తెలిపారు. గత నెల రోజుల కాలంలో కంపెనీలకు క్యాష్ ఫ్లో బాగా తగ్గిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోన్ని రికవరీ చెందటానికి వాటికి మరింత సమయం అవసరమని తెలిపారు. అందువల్ల ఫైనాన్షియల్ ఇయర్‌ను పొడిగించాలని కోరారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే చాలా వాటికి డెడ్‌లైన్‌ను మార్చి నుంచి జూన్‌కు పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వల్ల చాలా ప్రభావం పడుతోందని, దీని వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, కంపెనీల ఆర్థిక స్థితిగతులు కూడా మరిపోతున్నాయని కేపీబీ అసోసియేట్స్ పార్ట్‌నర్ పరాస్ సవ్లా తెలిపారు. కరోనా ఎఫెక్ట్ కంపెనీల ఆర్థిక పరిస్థితులపై రెండు మూడు త్రైమాసికాల వరకు ఉండొచ్చని తెలిపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్‌ను పొడిగిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆర్థిక సంవత్సరానికి మారచాలని భావించింది. క్యాలెండర్ ఇయర్‌తోపాటే ఫైనాన్షియల్ ఇయర్‌ను కూడా ఉంచాలని ప్రయత్నించింది. దీని కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ కూడా ఫైనాన్షియల్ ఇయర్‌ను మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం ఈ అంశంపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా జనవరి -డిసెంబర్‌ను క్యాలెండర్ ఇయర్ అని, ఏప్రిల్- మార్చిని ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పుకుంటారు.





Untitled Document
Advertisements